బీసీ రిజర్వేషన్లపై యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు

by Thanuru Gopichand |

బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

బీసీ రిజర్వేషన్లపై యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లో బలహీన వర్గాల రిజర్వేషన్ల పరిమితి 50శాతం మించకూడదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగ సవరణే ఏకైక మార్గంగా యనమల అభిప్రాయపడ్డారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించాలన్నారు. తద్వారా రిజర్వేషన్ 50శాతం పరిమితిని అధిగమించేందుకు రాజ్యాంగ సవరణ తీసుకొచ్చే అవకాశం ఏర్పడుతుందన్నారు.

ప్రభుత్వ విద్య, ఆరోగ్య రంగాలకు కూడా అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రెండు రగాల్లో మానవ వనరులను పెంచడం ద్వారా సమాజంలో అనేక సానుకూల మార్పులు వస్తాయన్నారు. అసమానతలు తొలగుతాయని తెలిపారు. ఆర్థిక, విద్యా, ఆరోగ్యపరమైన అంశాల్లో సమానత్వానికి ఆస్కారం ఉంటుందన్నారు.

Next Story