- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ జైలుకు వెళ్లడం ఖాయం..యనమల షాకింగ్ కామెంట్స్
మాజీ సీఎం జగన్ జైలుకు వెళ్లడం ఖాయం అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జగన్ రాష్ట్ర సంపదను దోచుకున్నాడని ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ జైలుకు వెళ్లడం ఖాయం అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జగన్ రాష్ట్ర సంపదను దోచుకున్నాడని ఆరోపించారు. రూ.3700 కోట్లు లిక్కర్ ఆదాయం, రూ.1300 కోట్లు ఇసుక సొమ్ము దోపిడీకి గురైందన్నారు. కేసులు అన్నీ తేలితే జగన్ జైలుకు వెళ్లడం ఖాయం అని జోస్యం చెప్పారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని రాష్ట్ర సంపద జగన్ ఇంట్లోకి వెళ్లిందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఖజానాను పాడు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడంటూ మండిపడ్డారు. వైసీపీ హయాంలో 14 లక్షల కోట్ల అప్పు చేశారని యనమల అన్నారు. అంతే కాకుండా రూ. లక్ష కోట్ల వడ్డీ కట్టాల్సి ఉందని చెప్పారు. ఖజానాను గాడిలో పెట్టి ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. 2029 ఎన్నికల తరవాతనే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశమే లేదన్నారు.






