- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేమూరి కావేరి ట్రావెల్స్‌కు గూగుల్‌లో వరస్ట్ రివ్యూస్.. వాళ్లని నమ్మొద్దంటున్న ప్యాసింజర్లు
కర్నూల్ జిల్లా చిన్నటేకూరు గ్రామం వద్ద వి కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ బస్సు ప్రమాదంలో 20 మంది వరకూ మరణించగా..

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లా చిన్నటేకూరు గ్రామం వద్ద వి కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ బస్సు ప్రమాదంలో 20 మంది వరకూ మరణించగా.. మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తిస్తున్నారు. ప్రమాద స్థలంలో మాంసం ముద్దలు, అస్థిపంజరాలు మాత్రమే ఉండటంతో భీతావహ వాతావరణం కనిపిస్తోంది. అయితే.. ఈ ప్రమాదం తర్వాత కావేరీ ట్రావెల్స్ రేటింగ్స్ పై గూగుల్ లో కొందరు సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ ట్రావెల్స్ కు వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ రివ్యూస్ ఉన్నాయి.
గూగుల్ రేటింగ్స్ లో మరీ దారుణంగా 1.9స్టార్ రేటింగ్ ఉంది. ఇక కావేరీ ట్రావెల్స్ కు చెందిన ఏసీ స్లీపర్ బస్సుల్లో ప్రయాణించిన వారైతే పొట్టు పొట్టు తిడుతూ రివ్యూలు రాశారు. టైమ్ పంక్చువాలిటీ ఉండదని, బస్సు అరైవల్ సమయానికంటే రెండు, మూడు గంటలు ఆలస్యంగా వస్తారని పేర్కొన్నారు. ఎందుకు లేట్ అవుతుందని కాల్స్ చేస్తే రెస్పాండ్ అవ్వరని, కస్టమర్ సర్వీస్ కు కంప్లైంట్ చేయాలన్న రెస్పాన్స్ ఇవ్వరని వాపోయారు. 577 రివ్యూలు ఉండగా.. చాలా మంది ఈ ట్రావెల్స్ లాంటి వరస్ట్ ట్రావెల్స్ ను తామెప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు. సింగిల్ గా ఎన్నోసార్లు ఎన్నో బస్సుల్లో జర్నీ చేశామని, ఈ బస్సు జర్నీలో మాత్రం వరస్ట్ ఎక్స్ పీరియన్స్ ఫేస్ చేశామన్నారు. లోపల ఛార్జింగ్ పాయింట్స్ పనిచేయవని, డ్రైవర్ అందుకు సంబంధించిన స్విచ్ ను ఆఫ్ లో ఉంచుతాడని అదేమని అడిగితే తమకేమీ తెలియదని చెప్తారని రివ్యూల్లో చెప్పుకొచ్చారు.
ప్యాసింజర్ కు ఇస్తామని చెప్పిన మినిమం ఫెసిలిటీస్ ఇవ్వకుండానే.. డబ్బులు మాత్రం తీసుకుంటున్నారని వాపోయారు. స్టాఫ్ బిహేవియర్ కూడా రూడ్ గా ఉంటుందని, ఏసీ పనిచేయట్లేదని కంప్లైంట్ చేసినా, ఏసీ బ్లోవర్ క్లోజ్ చేయడానికి లేదేమని అడిగినా రెస్పాన్స్ లేదని రివ్యూల్లో రాసుకొచ్చారు. ఇక చిన్న వర్షం పడినా లగేజీని.. లగేజ్ డోర్ లో పెట్టరని, అడిగితే వర్షం పడుతుందని చెప్తున్నారన్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. కావేరీ ట్రావెల్స్ చెందిన బస్సుల్లో వివిధ ప్రాంతాల నుంచి ట్రావెల్ చేసినవారు తాము ఎదుర్కొన్న సమస్యలను పూసగుచ్చినట్లు రివ్యూల్లో వివరించారు.
తాజాగా జరిగిన ప్రమాదం విషయానికొస్తే.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో దాదాపు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే ఉన్నారు. సాధారణంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఉద్యోగస్తులెవరైనా బస్సు రేటింగ్స్ చెక్ చేశాకే టికెట్స్ బుక్ చేసుకుంటారు. మరి ఇంత తక్కువ రేటింగ్ ఉన్నా వి కావేరి ట్రావెల్స్ బస్సుకే అంతమంది ఎందుకు టికెట్స్ చేసుకున్నారు? రష్ వల్ల మరో బస్సు దొరకలేదా ?
టికెట్ రేట్లు తక్కువ కాబట్టి చేసుకుని ఉంటారా అంటే.. కానే కాదు. ఎందుకంటే అన్ని ట్రావెల్స్ మాదిరిగానే వీక్ డేస్ లో తక్కువ ధర, పండుగలు, వీకెండ్ రష్ సమయాల్లో అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తోంది వి కావేరి ట్రావెల్స్. అక్టోబర్ 25 శనివారం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వి కావేరీ ట్రావెల్స్ వోల్వో 9600 ప్రీమియరం మల్టీ యాక్సెల్ ఏసీ స్లీపర్ టికెట్ ధర రూ.1759, వోలల్వో మల్టీ యాక్సెల్ ఏసీ స్లీపర్ విత్ ఎల్ఈడీ టికెట్ ధర రూ.1474, వీఈ ఏచర్ ఏసీ బిజినెస్ క్లాస్ స్లీపర్ టికెట్ రేటు రూ.2961గా ఉంది. అక్టోబర్ 26 ఆదివారం ఇవే బస్సుల టికెట్ ధరలు వరుసగా.. రూ.2160, రూ.1630, రూ.3141గా ఉన్నాయి. మంగళవారం రూ.1190, రూ.1128, రూ.1701గా ఉండగా.. అక్టోబర్ 29 బుధవారం రోజున రూ.972, 984, రూ.1611గా ఉన్నాయి. ఇలా టిక్కెట్ ధరలు ఒక్కోరోజు ఒక్కోలా ఉంటున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవాలని సిద్ధమైన ప్రభుత్వాలు కాస్త ఈ టికెట్ రేట్లపై కూడా దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.






