- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో విషాదం.. భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి
by Naga Rani Yarlagadda |
తిరుమలలో విషాద ఘటన జరిగింది. మూడంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి.. ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో విషాద ఘటన జరిగింది. మూడంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి.. ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అవధూత దత్తపీఠం వద్ద సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతిచెందిన వ్యక్తిని మణికంఠన్ (35)గా గుర్తించారు. వాటర్ ట్యాంక్ ను మరమ్మతు చేస్తున్న సమయంలో మణికంఠన్ కాలుజారి పడటంతో.. అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. మృతుడి స్వస్థలం తమిళనాడులోని తిరుపత్తూరులోని వనియంబాడి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






