- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరితగతిన పనులు పూర్తి చేయాలి : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కూటమి ప్రభుత్వం అభివృద్ధితోపాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : బనగానపల్లె - కోవెలకుంట్ల బైపాస్ రోడ్డు (Banaganapalle - Kovelakuntla Road) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy) అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎటువంటి రాజీకి ఆస్కారం ఉండకూడదని స్పష్టం చేశారు. బనగానపల్లెలో ఆదివారం ఆయన విస్తృత పర్యటనను నిర్వహించారు. పర్యటనలో భాగంగా బనగానపల్లె జుర్రేరు (Jurreru) ముంపు ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి వివిధ విషయాలను తెలుసుకున్నారు. అదే విధంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. అనంతరం జుర్రేరు వాగు సైడ్ వాల్ పనులను, వాగుపై నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలించారు. బనగానపల్లెలోని కూరగాయల మార్కెట్(Vegetable Market) లో నూతనంగా నిర్మిస్తున్న చేపలు, మాంసం షాపుల పనులు పరిశీలించి.. మార్కెట్లోకి మౌలిక వసతుల గురించి వాకాబు చేశారు. అక్కడి నుంచి షాదీ ఖానా నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. త్వరలోనే పనులు పూర్తయ్యి షాదీ ఖానా (Shaadi Khaana) అందుబాటులో వస్తుందని తెలిపారు. పాత ఎంఆర్ఓ ఆఫీసు పునరుద్ధరణ పనులను పరిశీలించి పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధితోపాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.






