- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.4,500 కోట్లతో కడప స్టీల్‌ప్లాంట్ తొలి దశ పనులు ప్రారంభం
కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చర్యలు చేపట్టింది.

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చర్యలు చేపట్టింది. ప్లాంట్ ఏర్పాటుపై JSW ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీంతో రూ.4,500 కోట్ల పెట్టుబడితో స్టీల్‌ప్లాంట్ తొలి దశ పనులు ప్రారంభించబోతున్నారు. ఈ ప్లాంట్ కోసం ప్రభుత్వం సున్నపురాళ్లపల్లెలో 1,100 ఎకరాలు కేటాయించింది. ఇక తొలి దశలో ప్లాంట్ ప్రాథమిక మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి యూనిట్ల స్థాపన జరుగుతుంది. ఈ ప్లాంట్ రాష్ట్రంలో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదపడనుంది. అలాగే, రూ.11,850 కోట్ల పెట్టుబడితో రెండో దశ పనులు పూర్తి చేయనున్నారు. ఈ దశలో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడం, అదనపు యూనిట్ల నిర్మాణం జరుగుతుంది. సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ప్రారంభం కానుంది. రెండో దశ పూర్తయిన తర్వాత, మొత్తం ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 3 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా.






