- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదాలు తప్పుకావొచ్చు.. మాటల్లో నిజం ఉంది
ఆడవారి వస్త్రధారణ విషయమై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎన్ఐఆర్ (TDP NRI) అధికార ప్రతినిధి చెంచు వేణుగోపాల్ రెడ్డి (Chenchu Venugopal Reddy) స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆడవారి వస్త్రధారణ విషయమై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎన్ఐఆర్ (TDP NRI) అధికార ప్రతినిధి చెంచు వేణుగోపాల్ రెడ్డి (Chenchu Venugopal Reddy) స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నటుడు శివాజీ మంచి సందేశం ఇవ్వాలనుకున్నారు కానీ.. ఆయన వాడిన భాష సరైనది కాదన్నారు. ఆయన పదాలు తప్పుకావొచ్చు కానీ, మాటల్లో నిజం ఉందన్నారు. ఆయన చెప్పిన మాటలను ఏకీభవించక తప్పదన్నారు. హీరోయిన్లు జనాల్లోకి, ఫంక్షన్లకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా దుస్తులు ధరించాలన్నారు. ఎవరైనా అక్కడ తప్పుగా ప్రవర్తిస్తే పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతాయన్నారు. కాబట్టి అమ్మా.. జాగ్రత్తగా ఉండండనే ఉద్దేశంతోనే శివాజీ ఆ వ్యాఖ్యలు చేశారన్నారు. దీనిని బాధ్యత గల ప్రతి పౌరుడు, సమాజంలో సభ్యత గల ఏ వ్యక్తి అయినా తప్పు పట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మహిళలకు గౌరవం వారు వేసుకునే దుస్తులు, మాట్లాడే తీరు, ప్రవర్తన వల్ల వస్తుందన్నారు. సిగ్గు, మర్యాదలను పక్కనబెట్టి బజార్లో తిరగడం వల్ల కాదని పేర్కొన్నారు. స్వేచ్ఛ అవసరం కానీ ఆ స్వేచ్ఛ సంస్కృతి, సంప్రదాయాలను హేళన చేసేదిగా ఉండకూడదన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు, సామాజిక బాధ్యతకు మధ్య సమతుల్యం ఉండాలని స్పష్టం చేశారు.
ఆ వార్తల్లో నిజం లేదు..
అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్ గురించి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. అవన్నీ కల్పితమైన ప్రచారాలేనని చెంచు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాయచోటి ప్రజలు ఈ వదంతులను నమ్మాల్సిన అవసరం లేదని తెలిపారు. భయపడాల్సిన అవసరం అంతేకంటే లేదన్నారు. ఒకవేళ నిజంగా ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితి వస్తే అప్పుడు టీడీపీ కార్యకర్తలే కాకుండా నాయకులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వెనుకాడరని అన్నారు. తామంతా రాయచోటి ప్రజల పక్షానే నిలబడతామని ప్రకటించారు. రాయచోటి నియోజకవర్గం వాసిగా.. అన్నమయ్య జిల్లా ప్రజల్లో ఒకడిగా తాను ఈ మాటలు చెబుతున్నానని తెలిపారు.






