నాగులచవితి రోజున అద్భుతం.. పరవశించిన భక్తులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-29 13:18:42  IST  )

ఆంధ్రప్రదేశ్ లో నాగుల చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

నాగులచవితి రోజున అద్భుతం.. పరవశించిన భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో నాగుల చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఉదయాన్నే నాగపుట్టల వద్దకు భక్తులు చేరుకుని, పూజలు చేసి, దీపాలను వెలిగించి పుట్టలు పాలు పోసి.. నాగదేవత ఆశీస్సులు అందుకున్నారు. కాగా.. నాగుల చవితి పర్వదినాన ఒక అద్భుత దృశ్యం జరిగింది. శివయ్యకు ఉదయాన్నే పూజలు చేస్తున్న సమయంలో రెండు నాగుపాములు పడగవిప్పి దర్శనమిచ్చాయి.

నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో ఉన్న విశ్వనాథస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో రెండు నాగుపాములు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి.. శివలింగంపైకి చేరుకుని పడగవిప్పి దర్శనమిచ్చాయి. అక్కడ ఉన్న పుట్టలో పాలు పోసేందుకు వచ్చిన భక్తులు ఈ దృశ్యాన్ని చూసి పరవశించిపోయారు.

https://x.com/RaniJournalist1/status/1981992582424256977?

Next Story