AP News : సజ్జలకు మహిళా కమిషన్ నోటీసులు

by Muthe.Rajitha |

ఏపీ రాజధాని అమరావతి మహిళలు నిన్న విజయవాడ సాక్షి ఆఫీసు ముందు ధర్నాకు దిగగా.. వారిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

AP News : సజ్జలకు మహిళా కమిషన్ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతి మహిళలు నిన్న విజయవాడ సాక్షి ఆఫీసు ముందు ధర్నాకు దిగగా.. వారిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నిరసన చేస్తున్న వారు సంకర తెగ అని, పిశాచాలు అంటూ పరుష పదజాలంతో దూషించారు. ఒకవైపు జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుండగా.. సజ్జల వ్యాఖ్యలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయ నేతలు, మహిళలు సజ్జలపై దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా సజ్జల రామకృష్ణా రెడ్డిపై ఏపీ మహిళా కమిషన్(AP Women Commission) సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో సజ్జలకు సమన్లు పంపిస్తామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయనున్నట్టు తెలియజేశారు.

Next Story