- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింహాచలం అప్పన్నను దర్శించుకున్న మహిళా క్రికెటర్లు
ప్రస్తుతం భారత క్రికెటర్లు ఏపీలోని సింహాచలం సింహాద్రి అప్పన్నస్వామి గుడికి క్యూ కడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం భారత క్రికెటర్లు ఏపీలోని సింహాచలం సింహాద్రి అప్పన్నస్వామి గుడికి క్యూ కడుతున్నారు. ఇటీవల భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అప్పన్నస్వామిని దర్శించుకొని ఆశీర్వాదం పొందగా.. తాజాగా భారత జట్టు మహిళా క్రికెటర్లు సింహాచలాన్ని దర్శించుకున్నారు. సోమవారం సింహాద్రి అప్పన్నను మహిళా క్రికెట్ జట్టు సభ్యులు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, రేణుక సింగ్, షెఫాలీ వర్మ, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీచరణితో పాటు అంపైర్లు డీఎస్ లక్ష్మి, ఇబ్బందా రతి తదితరులు దర్శించుకున్నారు.
ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు వారికి స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం అక్కడి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పండితులు వారికి వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.






