Pawan Kalyan : పవన్ కల్యాణ్ కోసం మహిళ 500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర

by Y. Venkata Narasimha Reddy |

జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే.

Pawan Kalyan : పవన్ కల్యాణ్ కోసం మహిళ 500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. సినిమాల నుంచి రాజకీయాల్లో చేరిన జనసేన పార్టీ స్థాపించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా మారార. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికల్లో కూటమి విజయానికి బాటలు వేశారు. ఆరంభంలో చెగువేరా స్ఫూర్తి మాటలతో సాగిన పవన్ రాజకీయం క్రమంగా సనాతన ధర్మ పరిరక్షకుడి పాత్రకు మారిపోయింది. ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలనలో తనదైన మార్క్ ను చూపుతున్న పవన్ కల్యాణ్ కు రాజకీయ, సినీ రంగంలో వీరాభిమానులు ఎక్కువే ఉన్నారు.

తాజాగా పవన్ కల్యాణ్ పట్ల తన అభిమానాన్ని చాటుకుంటూ జనసేన మహిళా కార్యకర్త ఏకంగా 500కిలో మీటర్ల సైకిల్ యాత్ర చేపట్టడం వైరల్ గా మారింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహిళా కార్యకర్త రాజేశ్వరి పవన్ కల్యాణ్ ను కలవాలన్న ఏకైక లక్ష్యంతో ఆదోని నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వరకు ఏకంగా 500 కిలోమీటర్లు సైకిల్ యాత్ర కొనసాగిస్తోంది. ఇందుకు సంబంధించి ఆమె విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించినప్పటి నుంచి తన ఆశయాలు నచ్చి పార్టీ కోసం పని చేశానని రాజేశ్వరి తెలిపింది.

Next Story