ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై మహిళ సంచలన ఆరోపణలు

by Ajay Maddhiboyina |

ఉద‌యగిరి ఎమ్మెల్యే కాక‌ర్ల సురేష్ పై వెంగ‌మాంబ అనే మ‌హిళ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. రాజ‌కీయాల్లోకి ర‌మ్మ‌ని త‌న‌ను సురేష్ మోసం చేశార‌ని ఆరోపించింది.

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై మహిళ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉద‌యగిరి ఎమ్మెల్యే కాక‌ర్ల సురేష్ పై వెంగ‌మాంబ అనే మ‌హిళ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. రాజ‌కీయాల్లోకి ర‌మ్మ‌ని త‌న‌ను సురేష్ మోసం చేశార‌ని ఆరోపించింది. ఉమెన్ అడ్వైజ‌ర్ గా ప‌దివి ఇస్తామ‌ని చెప్పార‌ని తెలిపింది. 2029లో అసెంబ్లీలో అడుగుపెట్ట‌నిస్తాన‌ని హామీ ఇచ్చార‌ని.. ఇప్పుడు అడిగితే ముఖం చాటేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. దీనిపై సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్ దృష్టి సారించాల‌ని కోరింది. నేత‌ల మాట‌లు విని రాజ‌కీయాల్లోకి వ‌చ్చి మోస‌పోవ‌ద్దు అని ఆవేదన వ్య‌క్తం చేసింది. త‌న మాట‌లు న‌చ్చాయ‌ని చెప్పి పార్టీలోకి పిలిచార‌ని చెప్పింది.

కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టి మ‌రీ ప్ర‌తిరోజు ఎమ్మెల్యే వెంట తిరిగాన‌ని తెలిపింది. అంగ‌న్వాడీ కోర్డినేట‌ర్ గా జీతం లేకుండానే ప‌నిచేశాన‌ని చెప్పింది. ఆ త‌ర‌వాత త‌న ప‌వ‌ర్స్ అన్నీ క‌ట్ చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అలా ఎందుకు చేశార‌ని వెళ్లి అడిగితే నీకెందుక‌మ్మా రాజ‌కీయాలు అని చెప్పార‌ని తెలిపింది. క‌ర్నాట‌క‌లో త‌మ‌కు వ్యాపారం ఉంద‌ని అది వ‌దిలిపెట్టి ర‌మ్మన్నార‌ని చెప్పింది. అలా చేసి ఉంటే రోడ్డుపై ప‌డేవాళ్ల‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. కాక‌ర్ల సురేష్ ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని ఆరోపించింది. స్త్రీల‌ను ప‌నుల కోసం వాడుకుని ఇలా చేయ‌డం స‌రికాద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Next Story