ఆర్టీసీ బస్సులో బంగారం పోగొట్టుకున్న మహిళ

by Thanuru Gopichand |

ఆర్టీసీ బస్సులో ఓ మహిళ బంగారం (Gold) పోగొట్టుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

ఆర్టీసీ బస్సులో బంగారం పోగొట్టుకున్న మహిళ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్టీసీ బస్సులో ఓ మహిళ బంగారం (Gold) పోగొట్టుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షబానా అనే మహిళ అనంతపురం నుంచి కదిరి (Anantapur To Kadiri) వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కడానికి ముందే తనతో పాటు 15 తులాల బంగారు ఆభరణాలను వెంటబెట్టుకుంది. తన బ్యాగులో బంగారం పెట్టుకొన్ని ప్రయాణిస్తోంది. టిక్కెట్టు కోసం ఆధార్ కార్డును చూపించేందుకు బ్యాగును తెరిచింది. బ్యాగులో బంగారం మిస్ అయినట్లు షబానా గమనించింది. బంగారం కోసం పలుమార్లు బ్యాగును వెతికినా కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. విషయాన్ని బస్సు కండక్టరుకు తెలియజేయడం బస్సును నిలిపివేశారు. విషయం పోలీసులకు చేరడంతో వారు అనంతపురం కలెక్టరేట్ వద్ద బస్సును నిలిపివేశారు. బస్సు అంతటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికులను కూడా చెక్ చేసి చూశారు. అయినప్పటికీ బంగారం జాడ దొరకలేదు. దీంతో బలోదిబోమనడం బాధితురాలు వంతయ్యింది. ఆమె బాధను చూసి తోటి ప్రయాణికులు సానుభూతిని తెలిపారు. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story