- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘క్వాటర్ మందు కావాలి.. లేదంటే?’.. ఆర్టీసీ బస్సు ముందు మహిళ హల్‌చల్
రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ మద్యం మత్తులో హల్‌చల్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఏపీ(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఒక మహిళ మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం సృష్టించింది. పుల్లలచెరువు రోడ్డులో ‘‘క్వాటర్ మందు కావాలి’’ అంటూ మొండికేస్తూ ఏకంగా ఆర్టీసీ బస్సుకు అడ్డంగా కూర్చుంది. క్వాటర్ మందు ఇప్పించండి లేదంటే బస్సును ముందుకు కదలినివ్వను అని మొండికేసింది. సుమారు అరగంట పాటు బస్సును కదలనివ్వకుండా.. అరుస్తూ హల్‌చల్ చేసింది. ఆమె తీరుతో స్థానికులు, ప్రయాణికులు బిత్తరపోయారు. ఈ తతంగం అంతా చూస్తున్న బస్సు డ్రైవర్ విసిగిపోయి.. చివరకు ఆమెను రోడ్డు పక్కకు తప్పించి బస్సును ముందుకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story






