జాతీయ రహదారిపై బైక్ బోల్తా.. మహిళ స్పాట్ డెడ్

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది.

జాతీయ రహదారిపై బైక్ బోల్తా.. మహిళ స్పాట్ డెడ్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఏపీ(Andhra Pradesh)లోని కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల వద్ద 216 జాతీయ రహదారి పై బైక్ అదుపుతప్పి మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. యశ్వంత్ అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి గోపాలపురం నుంచి రాజమండ్రికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మహిళ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆలమూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story