- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లాలో దారుణం.. ఏసీ పేలి మహిళ మృతి
by Chukka Sudharani |
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఏసీ పేలీ ఓ మహిళ మృతి చెందింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఏసీ పేలీ ఓ మహిళ మృతి చెందింది. చీమకుర్తి పట్టనానికి చెందిన దామర్ల శ్రీదేవి (50), తన కుమారుడు సాయితేజతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె ఒంగోలు జడ్పీ కార్యాలయంలోని పీఎఫ్ విభాగంలో విధులు నిర్వహిస్తు్న్నారు. అయితే ఆదివారం రాత్రి రోజూ మాదిరిగానే ఏసీ వేసుకుని తన కుమారుడితో నిద్రిస్తుంది.
ఈ క్రమంలోన వారు గాఢ నిద్రలో ఉండగా.. అధిక వోల్టెజీతో విద్యుత్త్ సరఫరా కావడంతో ఏసీ పేలిపోయింది. దీంతో తల్లి కొడుకులు ఇద్దరు ఏసీ నుంచి వచ్చిన పొగగు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శ్రీదేవి తాజాగా మృతి చెందారు. కుమారుడు సాయి తేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
- Tags
- AC
- women died
Next Story






