- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వంట విషయంలో గొడవ.. 9 నెలల చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య
ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో చెరువులో దూకి 9 నెలల చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు...

దిశ, వెబ్ డెస్క్: మహిళలు మనస్థాపం చెందుతున్నారు. క్షణికావేశంలో తమ ప్రాణాలను తీసుకుంటున్నారు తమకు పుట్టిన పిల్లలను సైతం తమతోనే తీసుకుపోతున్నారు. ఇలాంటి ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. సంతనూతలపాడులో దంపతులు సుజాత, వెంకటేశ్వర్లు జీవనం సాగిస్తున్నారు. వీరికి 9 నెలల చిన్నారి కూడా ఉంది. హాయిగా గడిచిపోతున్న వీరి జీవితం సడెన్‌గా మలుపుతిరిగింది. చిన్న గొడవ జరగడంతో భార్యతో పాటు 9 నెలల చిన్నారి కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. చెరువులో దూకి 9 నెలల చిన్నారితో కలిసి సుజాత ఆత్మహత్య చేసుకున్నారు. వంట విషయంలో సుజాతకు భర్త వెంకటేశ్వర్లుతో గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన సుజాత ఆత్మహత్య చేసుకున్నారు. చెరువులో దూకినట్లు సమాచారం అందుకున్న పోలీసులు తల్లి, బిడ్డ మృతదేహాలను బయటికి తీశారు.అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. అయితే సుజాత ఆత్మహత్యకు ముందు తన 9 నెలల చిన్నారితో కలిసి చెరువు వైపు వెళ్తున్న దృశ్యాలు స్థానిక టీవీ పుటేజ్‌లో నమోదు అయ్యాయి. వీటి ఆధారంగానే సుజాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






