- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Group2: తలపై జీలకర్ర బెల్లం.. అలాగే గ్రూప్ 2 పరీక్షకు..
ఈరోజు తెల్లవారుజామునే వివాహం జరిగింది.. వెంటనే పరీక్ష ఉంది.. ఎగ్జామ్ వాయిదా వేయలేం కదా.. దీంతో పెళ్లి దుస్తులతోనే పరీక్ష కేంద్రానికి వచ్చింది నవ వధువు.

X
దిశ డైనమిక్ బ్యూరో: ఈరోజు తెల్లవారుజామునే వివాహం జరిగింది.. వెంటనే పరీక్ష ఉంది.. ఎగ్జామ్ వాయిదా వేయలేం కదా.. దీంతో పెళ్లి దుస్తులతోనే పరీక్ష కేంద్రానికి వచ్చింది నవ వధువు. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల సెంటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతికి చెందిన నమిత.. గ్రూప్ 2(Group2) ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయింది. మెయిన్స్ రాయాల్సి ఉంది. నిన్న రాత్రి ఆమె వివాహం జరిగింది. ఉదయాన్నే పరీక్ష ఉండడంతో.. తలపై జీలకర్ర బెల్లం.. పెళ్లి దుస్తులతో అలాగే ఎగ్జామ్స్ సెంటర్ కు వచ్చింది. ఫ్రెండ్స్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎగ్జామ్స్ సెంటర్ కు వచ్చిన వారు ఆసక్తిగా గమనించారు. వివాదాలు, గందరగోళ పరిస్థితుల మధ్య గ్రూప్-2 మెయిన్స్ మొదలైంది. రాష్ట్రంలోని 175 కేంద్రాల్లో 92,250 మంది పరీక్ష రాయనున్నారు.
Next Story






