- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shyamala counter to Chiranjeevi : వారసుడు కొడుకే అవుతాడా..? కూతుర్లు కారా..? : చిరంజీవికి శ్యామల కౌంటర్
రామ్ చరణ్ (Ram Charan)కు వారసుడిగా కొడుకు(Son)పుట్టాలని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)చేసిన వ్యాఖ్యలపై వైసీపీ(YCP Spokesperson and Anchor) అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల(Shyamala) ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : రామ్ చరణ్ (Ram Charan)కు వారసుడిగా కొడుకు(Son)పుట్టాలని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)చేసిన వ్యాఖ్యలపై వైసీపీ(YCP Spokesperson and Anchor) అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల(Shyamala) ఫైర్ అయ్యారు. బ్రహ్మ ఆనందం చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవిని యాంకర్ సుమ మీ తాత గారి ఫోటో చూపించమని అడిగారు. చిరంజీవి జోక్ గా ఇంట్లో నా చుట్టు మొత్తం ఆడపిల్లలేనని(గ్రాండ్ డాటర్స్)..నా పరిస్థితి లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయిందని..అందుకే రామ్ చరణ్ ను ఒక్కటే అడుగుతుంటానని..దయచేసి ఈసారి ఒక అబ్బాయిని కనురా..మన లెగసీని ముందుకు కొనసాగించాలని..మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని భయం వేస్తుందని సరదాగా చెప్పారు. నాకు మనవడు కావాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి తన మనసులో కోరిక బయటపెట్టారు.
మెగాస్టార్ చిరంజీవి వారసుడు కావాలన్న వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల మండిపడ్డారు. వారసుడు కొడుకే అవుతాడా..? కూతుర్లు కారా? అని ప్రశ్నించారు. మెగాస్టార్ చిరంజీవి ఏ ఉద్దేశ్యంతో అన్నారో తనకు తెలియదన్నారు. వారసుడు అనేవాళ్లు కొడుకు అనే ఉద్దేశంలో నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుందన్నారు. మహిళలు అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నారని.. ఉపాసన అన్నీ వ్యాపారాలు చక్కగా నడుతున్నారన్నారని గుర్తు చేశారు. వారసులు అంటే ఒక్క కొడుకే కానక్కరలేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని శ్యామల పేర్కొన్నారు.
అటు వారసుడు కావాలన్న చిరంజీవి వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాలలో విమర్శలు..సమర్థనలు వ్యక్తమవుతున్నాయి."అబ్బాయి పుట్టాలి" అన్న ఉద్దేశంలో తప్పేమి లేదని..అయితే "ఆడపిల్లలు తమ లేగసీని కొనసాగించలేరు" అనే అభిప్రాయం వచ్చేలా చిరంజీవి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మానవీయ విలువలు, సమానత్వం భావాలను చిరంజీవి తన అభిమానులకు చెప్పాల్సింది పోయి ఇలా మాట్లాడటం తగదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందరు మాత్రం సరదగా సినిమా ఫంక్షన్ లో ఫ్లోలో నవ్వించేందుకు చెప్పిన మాటలకు పెడార్ధాలు తీయడం అనవసరమంటున్నారు.






