- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాకు రాజకీయ భిక్షపెట్టంది శ్రీధర్ రెడ్డి సోదరులే: పొట్లూరి స్రవంతి
నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. మేయర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పొట్లూరి స్రవంతి ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. మేయర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పొట్లూరి స్రవంతి ప్రకటించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె తన ప్రయాణం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోనే కొనసాగుతుందని తెలిపారు. తమకు రాజకీయ భిక్ష పెట్టింది శ్రీధర్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోనే తమ పయనం.. ప్రతి అడుగు అని క్లారిటీ ఇచ్చేశారు.
ఇప్పటికే అనేక ఫోన్ కాల్స్, ఒత్తిళ్లు వచ్చాయని అయినప్పటికీ తాను మాత్రం ఎమ్మెల్యే వెంటే నడుస్తానని చెప్పుకొచ్చారు. శ్రీధర్ రెడ్డి తనకు మద్దతుగా నిలవడంలో తన పదవికి అనేక ఇబ్బందులు వస్తాయని తెలుసు అని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వెనక్కి తగ్గేది లేదని తన రాజకీయ ప్రయాణం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటే నడుస్తుందని అవసరమైతే రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమేనని మేయర్ పొట్లూరి స్రవంతి ప్రకటించారు.
READ MORE






