- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ప్రజాస్వామ్యాన్ని రప్పా రప్పా నరుకుతారా?’.. మంత్రి పయ్యావుల తీవ్ర ఆగ్రహం
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నిన్న(బుధవారం) సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నిన్న(బుధవారం) సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 2029 తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు ఒక్కొక్కడిని యాట తలలు నరికినట్లు నరుకుతామంటూ రెచ్చగొట్టే ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు.
అయితే.. వైఎస్ జగన్ పర్యటనలో చోటుచేసుకున్న పరిస్థితులపై ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అరాచక వాదులను వెంటబెట్టుకుని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామంటూ ఫ్లెక్సీలే పెడుతున్నారని మంత్రి ఆరోపించారు. ఈ క్రమంలో గత ఐదేళ్ల అరాచక పాలనను ప్రజలు రప్పా రప్పా నరికేశారని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు.
ప్రజలు ఓడించినా తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా భయపెట్టాలనే చూస్తున్నారు. మాజీ సీఎం జగన్ రప్పా రప్పా నరుకుతామనే ఫ్లెక్సీని ఖండించాల్సింది పోయి సంతోషం అంటున్నారంటే హింసను ప్రేరేపించడం కాదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని రప్పా రప్పా నరుకుతారా? అంటూ మంత్రి పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి బ్యాచ్‌ని, రౌడీలను జగన్ పరామర్శిస్తారా? నీ పర్యటనలో ఇద్దరు చనిపోతే కనీసం పరామర్శించరా? భయపెట్టి రాజ్యం చెలాయించాలన్నట్లుగా జగన్ తీరు ఉందని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారులను భయపెట్టారు. ఇప్పుడు అధికారం పోయే సరికి రౌడీలను సమాయత్తం చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.






