- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనావాసాల్లోకి వన్యప్రాణి.. వ్యాలీ స్కూల్ రోడ్డులో జింక సంచారం
నగరంలోని విశాఖ వ్యాలీ స్కూల్ రోడ్డు సమీపంలో గురువారం ఒక జింక (Sambar Deer) ప్రత్యక్షం కావడంతో స్థానికంగా కలకలం రేగింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలోని విశాఖ వ్యాలీ స్కూల్ రోడ్డు సమీపంలో గురువారం ఒక జింక (Sambar Deer) ప్రత్యక్షం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. అడవి నుంచి దారి తప్పి జనసంచారం ఉన్న ప్రాంతంలోకి వన్యప్రాణి రావడాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అటవీశాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. జనాల రద్దీ ఉన్నప్పటికీ, ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది, ఆ (జింక) కణితికి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బంధించారు.
అడవిలోకి విడుదల..
పట్టుకున్న జంతువును అధికారులు వెంటనే సమీపంలోని సీతకొండ అటవీ ప్రాంతానికి తరలించి, అక్కడ సురక్షితంగా విడిచిపెట్టారు. అటవీ సిబ్బంది తక్షణమే స్పందించి వన్యప్రాణిని మళ్లీ అడవిలోకి పంపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






