- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిత్తూరులో ఏనుగులు, నంద్యాలలో చిరుత.. రాష్ట్రంలో ప్రజలను వణికిస్తోన్న అడవిజంతువులు
ఏపీలో అడవి జంతువులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. జనావాసాల్లోకి జంతువులు రావడంతో ప్రజలు భయపడిపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్ చల్ చేశాయి.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో అడవి జంతువులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. జనావాసాల్లోకి జంతువులు రావడంతో ప్రజలు భయపడిపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్ చల్ చేశాయి. తిమ్మసముద్రం-బుడ్డమాను చెరువు సమీపంలో ఏనుగులు సంచరిస్తూ కనిపించాయి. రెండు ఏనుగులు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు నంద్యాల జిల్లాలో చిరుత పులి సంచరిస్తోంది. వెలుగోడు రిజర్వాయర్ పంప్ హౌస్ సమీపంలో నెమలిని వెంటాడుతుండగా స్థానికులు చిరుతను ఫోటో తీశారు. దీంతో మత్య్సకారులు ఆ వైపు వెళ్లాలంటే భయపడిపోతున్నారు.
మొన్న పెద్దపులి
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా పెద్దపులి హల్ చల్ చేసింది. కూర్మాపురం అనే గ్రామంలోకి పులి రాగా ఓ పాడుబడిన ఇంట్లోకి ప్రవేశించింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అటవీశాఖ అధికారులు స్పెషల్ టీమ్స్ సహాయంతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దానిని పట్టుకున్నారు. అనంతరం దానిని జూ పార్క్ కు తరలించారు. ఇలా అడవి జంతువులు గ్రామాల్లోకి, ఇళ్లకు వద్దకు రావడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జంతువులను రక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు.






