- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్తలపై ఆగని దాడులు.. ఆ భార్య ఏం చేసిందో తెలిస్తే వణికి పోతారు
దేశంలో రోజురోజుకి భర్తలపై భార్యలు చేస్తున్న దాడులు, ఘోరాలు ఆగడం లేదు.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో రోజురోజుకి భర్తలపై భార్యలు చేస్తున్న దాడులు, ఘోరాలు ఆగడం లేదు. కొన్నిచోట్ల వారిని చంపి డ్రమ్ముల్లో కుక్కేస్తుంటే. ఇంకోచోట సుపారీ ఇచ్చి మరీ చంపేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల కరెంట్ షాకులు, నదిలోకి తోసేయడం, గొంతు నులిమి చంపడం నిత్యకృత్యం అయ్యాయి. దీంతో భర్తలు భార్యలను చూసి వణికి పోతుంటే, పెళ్లి చేసుకోబోయే యువకులు పెళ్లంటేనే బెంబేలు పడిపోతున్నారు. తాజాగా భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవకు భర్తపై మరుగుతున్న వేడినీళ్లు పోసి చంపాలని చూసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీలోని విశాఖపట్నం(Vishakhapatnam) జిల్లా భీమునిపట్నంలోని నేరెళ్ల వలసలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణ, గౌతమిల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా ఇరువురి మధ్య గొడవ జరిగింది. గొడవ అనంతరం కృష్ణ నిద్రపోతుండగా.. రాత్రి 2 గంటల సమయంలో గౌతమి మరుగుతున్న వేడినీళ్లను అతనిపై పోసింది. మంటలకు తాళలేక హాహాకారాలు చేయగా... స్థానికులు విశాఖ కేజీహెచ్ లో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.






