‘మాజీ సీఎం జగన్‌కు ఎందుకంత భయం?’.. వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న(సోమవారం) గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన విషయం తెలిసిందే.

‘మాజీ సీఎం జగన్‌కు ఎందుకంత భయం?’.. వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న(సోమవారం) గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన విషయం తెలిసిందే. సతీమణి భారతితో కలిసి వైఎస్ జగన్ సోమవారం అమరావతిలోని రాజ్‌భవన్‌కు చేరుకొని.. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశం అయ్యారు. అయితే.. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సీఎం సింగపూర్ పర్యటనలో ఉండగా మాజీ సీఎం జగన్ గవర్నర్‌‌తో భేటీ కావడం పై రాష్ట్ర రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది.

ఈ తరుణంలో మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవడం పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. ఈ మేరకు పలు ప్రశ్నలు సంధించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం హోదాలో అధికారికంగా గవర్నర్‌ను కలిశారా? లేక వ్యక్తిగతంగానా? అని ప్రశ్నలు గుప్పించారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా గవర్నర్‌ని కలిసి మాట్లాడిన విషయం ప్రజలకు వైఎస్ జగన్ ఎందుకు తెలియజేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ నిజనిజాలు బహిర్గతం చేయడానికి అంత భయం ఎందుకు? అని వర్ల రామయ్య నిలదీశారు.

Next Story