- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా మనమెందుకు పోటీ పడలేం..? చంద్రబాబు
ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడించారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల పనితీరుపై కూడా అధికారులకు పలు సూచనలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడించారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల పనితీరుపై కూడా అధికారులకు పలు సూచనలు చేశారు. సామాన్యుడికి మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలని, ఖర్చు చేసిన ప్రతీ రూపాయికి తగిన వైద్యం అందాలని తెలిపారు.
కార్పొరేట్ ఆసుపత్రులు లాభాలు ఆశించి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పుడు మనం ఏ లాభాపేక్ష లేకపోయినా నాణ్యమైన వైద్యం ఎందుకు అందించలేమని అధికారులను ప్రశ్నించారు. దీనిపైన దృష్టి పెట్టి సామాన్యులకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేయాలని చెప్పారు. దీన్ని ఒక సవాలుగా తీసుకొని యంత్రాంగం పని చేయాలన్నారు. రానున్న రోజుల్లో కార్పొరేట్ ఆసుపత్రులతో ప్రభుత్వ ఆసుపత్రులు పోటీ పడాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, విశాలమైన స్థలం అన్నీ ఉన్నప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు పోటీగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందించాలని ఉన్నతాధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.






