దాడులపై జనసేన, బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు..? బొత్స సత్యనారాయణ ఆవేదన

by Ramesh Naini |

పోలీసులు దగ్గరుండి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేయిస్తారా? మాకు కార్యకర్తలు లేరనుకుంటున్నారా? అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

దాడులపై జనసేన, బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు..? బొత్స సత్యనారాయణ ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీసులు దగ్గరుండి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేయిస్తారా? మాకు కార్యకర్తలు లేరనుకుంటున్నారా? అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అప్రతిష్టను మూటకట్టుకోవద్దని సూచించారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేయాలనుకున్నారా? అని ప్రశ్నించారు. గత మూడ్రోజులుగా కూటమి సర్కార్‌ విధ్వాంసానికి పాల్పడింది. వైసీపీ నేతలపై దాడులపై జనసేన, బీజేపీ నాయకులు ఎందుకు తప్పును తప్పు అని మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. ఆయన్ను దుర్భాషలాడితే అంబటి రియాక్ట్‌ అయ్యారన్నారు. ఇంటికి వచ్చి తాను మాట్లాడింది తప్పే అని మాట్లాడారని, కేంద్ర మంత్రి తడాఖా చూపిస్తామని అంటున్నాడన్నారు.

NDDB రిపోర్ట్‌ మేం ఇప్పించామా? అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం న్యాయమా? అని నిలదీశారు. తప్పు చేసిన వారిని దేవుడు క్షమించడని, ఎవరైనా సరే అనుభవిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిపై పెట్రోల్‌ బాంబులు వేసి చంపాలని అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వ పనితీరుపై ప్రజలే ఆలోచించాలని పిలుపునిచ్చారు.

Next Story