- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా టికెట్లతో నిండేది ఎవరి కడుపు.. 'హరిహర వీరమల్లు'పై కారుమూరి హాట్ కామెంట్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈనెల 24 ప్రంపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈనెల 24 ప్రంపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి 10 రోజులకు గాను టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే పెంచిన ధరలు జులై 24 నుంచి ఆగస్టు 2 వరకు అమల్లో ఉండనున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో లోయర్ క్లాస్ సీటుకు జీఎస్టీతో కలిపి రూ.100, అప్పర్ క్లాస్‌పై ఒక్కో సీటుకు రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునే వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్‌లలో రూ.200 (జీఎస్టీతో కలిపి) వరకు పెంచేందుకు అనుమతించారు. 23న (విడుదలకు ముందు రోజు) రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600 (జీఎస్టీతో అదనం)గా పెంచుతూ ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.
ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ సినిమాపై వైసీపీ కీలక నేత కారుమూరి సునీల్ (Karumuri Sunil) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడియో ఫంక్షన్‌లో పవన్ తమ ప్రభుత్వం వచ్చిందని.. కావాల్సిన టికెట్ రేట్లను పెంచుకున్నామంటూ గొప్పలు చెబుతున్నారని కామెంట్ చేశారు. సినిమా టికెట్లు అమ్ముకుంటే ఎవరి కడుపు నిండుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అయిల్‌పామ్, పొగాకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. కానీ, అవన్నీ కూటమి ప్రభుత్వానికి పట్టవని.. కేవలం వారి స్వార్థం కోసం చేయాల్సిన అక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్యులకు పట్టించుకోవడం లేదని.. కేవలం కార్పొరేట్లకే పెద్దపీట కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కారుమూరి సునీల్ ఆరోపించారు.






