- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర రాజకీయాలపై వెబ్ సిరీస్.. CM చంద్రబాబు పాత్రలో నటించేది ఎవరంటే?
టాలీవుడ్ దర్శకుడు(Tollywood Director), ప్రస్థానం ఫేమ్ దేవకట్టా(Devakatta) గురించి అందరికీ తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ దర్శకుడు(Tollywood Director), ప్రస్థానం ఫేమ్ దేవకట్టా(Devakatta) గురించి అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి చిత్రాలతో(Movies) తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడు తెరకెక్కించిన చిత్రాలు రాజకీయ కోణం, సామజిక సమస్యలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. అయితే రిపబ్లిక్ మూవీ అనంతరం చాలా రోజులు గ్యాప్ తీసుకున్న దేవకట్టా ఒక వెబ్ సిరీస్(Web series)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే.. సామాజిక అంశాలను కథా వస్తువులుగా తెరకెక్కించిన దర్శకుడు దేవ కట్టా ఓ వెబ్ సిరీస్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekhar Reddy), ప్రస్తుత సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్నేహం గురించి ఈ కథ ఉంటుందని సమాచారం. వీరిద్దరు కాలేజ్ డేస్(College Days) లో స్నేహితులుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరి స్నేహం అప్పుడు ఎలా ఉంది అనే దానిపై వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ సమయంలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), వైఎస్ఆర్(YSR) కలిసి యూత్ కాంగ్రెస్(Youth Congress)లో కీలక పాత్రలు పోషించారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కే ఈ సిరీస్‌లో సీఎం చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దివంగత మాజీ సీఎం వైఎస్‌ఆర్ రోల్‌లో చైతన్య రావు నటిస్తారని తెలుస్తోంది. జేడీఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ వెబ్ సిరీస్(Web series) రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమల్లో చర్చనీయాంశంగా మారిన ఈ అంశం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






