- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రప్పా రప్పా ప్లకార్డులు ప్రదర్శించిన యువకుడు ఎవరంటే?
ఇటీవల మాజీ సీఎం జగన్ పర్యటనలో పుష్ప సినిమాలోని రప్పా రప్పా అనే డైలాగులతో యువకుడు ప్లకార్డులు ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల మాజీ సీఎం జగన్ పర్యటనలో పుష్ప సినిమాలోని రప్పా రప్పా అనే డైలాగులతో యువకుడు ప్లకార్డులు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యక్తి టీడీపీ కార్యకర్తనే అని జగన్ చేసిన కామెంట్లపై టీడీపీ స్పందించింది. ప్లకార్డులు ప్రదర్శించిన బి. రవితేజ వైసీపీ కార్యకర్త అని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. గురువారం క్రోసూరు మండలం 88 త్యాల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఖండించారు. టీడీపీ సభ్యత్వంతో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పడంతోనే రవితేజ సభ్యత్వం తీసుకున్నాడని తెలిపారు. గ్రామానికి చెందిన మరికొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు. రవితేజ ఏనాడు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని అన్నారు. అతడు వైసీపీ నిర్వహించే కార్యక్రమాల్లో క్యాటరింగ్‌కు వెళతాడని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడితో రవితేజ దిగిన ఫోటోను మీడియాకు చూపించారు.






