- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాంతి.. సామరస్యం ఉన్నచోట రోజూ పండుగనే : డిప్యూటీ సీఎం
ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలి.

దిశ, వెబ్ డెస్క్ : శాంతి.. సామరస్యం ఉన్నచోట ప్రతిరోజూ పండుగనే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. భోగి పండుగను పురస్కరించుకొని ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలను తెలియజేశారు. సంక్రాంతి (Sankranti) అనగానే భోగి మంటలు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, సంప్రదాయ పందాలు, కొత్త దుస్తులు, పండి వంటలు మదిలో మెదులుతాయని డిప్యూటీ సీఎం అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతిని పురస్కరించుకొని పల్లెలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రశాంతత వెల్లివిరుస్తోందన్న సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేనేలేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో జరుగుతున్న సంక్రాంతి పండుగ నుంచి ప్రతి ఇల్లూ సౌభాగ్యంతో విలసిల్లాలని కోరుకున్నారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యాన్ని ప్రసాదించే ఈ సంక్రాంతి తెలుగువారందరికీ సర్వైశ్వర్యం, సమృద్ధి, శుభమంగళాలను ప్రసాదించాలని ఆ సర్వేశ్వరుడ్ని వేడుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.






