- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Girls missing అదృశ్యమైన ఆ నలుగురు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారంటే..
by Thanuru Gopichand |
కృష్ణా జిల్లాలో మాయమైన ఆ బాలికలు గుంటూరులో ప్రత్యక్షమయ్యారు.

X
దిశ డైనమిక్ బ్యూరో: కృష్ణా జిల్లాలో మాయమైన ఆ బాలికలు(girsl missing) గుంటూరులో ప్రత్యక్షమయ్యారు. వివరాల్లోకి వెళితే గన్నవరం మండలం ముస్తాబాదుకు చెందిన నలుగురు బాలికలు బెజవాడలోని ఓ ప్రైవేటు కాలేజిలో చదువుతున్నారు. రెండు రోజుల కిందట వారు కాలేజికి ఎగ్గొట్టారు. అక్కడి నుంచి ఓ షాపింగ్‌మాల్‌కు వెళ్లారు. దీంతో వారిని కాలేజి యాజమాన్యం, తల్లిదండ్రులు మందలించి నట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన వారు గురువారం తెల్లవారుజామున ఇంటినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలికలను హైదరాబాదు వెళుతుండగా పిడుగురాళ్ల సమీపంలో గుర్తించినట్లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో తల్లిదండ్రుల ఆందోళనకు తెరపడింది.
Next Story






