రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లో డబ్బులు జమ.. ఎప్పుడంటే?

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లో డబ్బులు జమ.. ఎప్పుడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం కింద ప్రతి రైతుకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి రూ.20 వేలు అకౌంట్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది.

అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava Scheme) పథకం లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమైంది. మొత్తం 46.64లక్షల మంది రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే.. పీఎం కిసాన్ 20వ విడత వాయిదా సొమ్ము వచ్చే నెల(ఆగస్టు) 2న రైతుల ఖాతాల్లో జమ కానుంది. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) దేశవ్యాప్తంగా నిధులు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో రైతులకు రూ.2 వేల చొప్పున పీఎం కిసాన్(PM Kisan) నిధులు జమ అవుతాయి.

ఏపీలో 41.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.831.60 కోట్లు అందుతాయి. అదే రోజు ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించనుంది. ఈ క్రమంలో రైతుల ఖాతాల్లో అన్నదాతా సుఖీభవ సొమ్ము కూడా జమ కానుంది.కేంద్రం ఇచ్చే రూ.2 వేలకు మరో రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7వేలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే.. కేంద్రం వాటా డబ్బులు రాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తుందని ఇప్పటికే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

Next Story