- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉచితంగా భూములిస్తామంటే నవ్వారు.. ప్రతిష్టాత్మక సంస్థలొచ్చాయి : మంత్రి నారా లోకేష్
ఫార్చూన్ ఫైవ్ విలువ చేసే భూములను ఉచితంగా ఇస్తామంటే కొందరు నవ్వారు. భూములిస్తే సంస్థలొస్తాయని ఎగతాళి చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఫార్చూన్ ఫైవ్ విలువ చేసే భూములను ఉచితంగా ఇస్తామంటే కొందరు నవ్వారు. భూములిస్తే సంస్థలొస్తాయని ఎగతాళి చేశారు. కానీ నేడు కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మ సంస్థలు విశాఖపట్నంకు వచ్చాయని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన మాన్సాస్, జీఎంఆర్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టును ముఖ్య ఆహ్వానితులుగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పరిశ్రమలు, సంస్థలకు ఉచితంగా భూములివ్వాలనే తమ నిర్ణయం వల్లే నేడు ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు ఏపీకి వస్తున్నాయన్నారు. వాటిని ఉత్తరాంధ్రలో భాగమైన విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందనని తెలిపారు.
ఎడ్యుసిటీ కోసం భూమి దానం
భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న ఎడ్యుసిటీ కోసం గోవా గవర్నర్ పూసపాటి గజపతి రాజు కుటుంబం భూదానం చేసిందన్నారు. మాన్సాస్ ఎడ్యుసిటీ ఏర్పాటుకు భూమిని కేటాయించారని పేర్కొ్న్నారు. విద్యా రంగం పట్ల పూసపాటి వంశస్తులకు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. విద్యా సంస్థల ఏర్పాటుకు వేలాది ఎకరాలు దారాదత్తం చేసిన చరిత్ర వారిదని పేర్కొన్నారు. అయితే ఇందుకు ప్రతిపాదన విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ప్రారంభమైందన్నారు. తాను అక్కడకు వచ్చిన అదితి రాజు తనను ఒక మ్యాప్ తో కలిశారన్నారు. ఉత్తరాంధ్రలో మాన్సాస్ విద్యా సంస్థలకు వేలాది ఎకరాల భూములున్నాయని తెలిపారు. విద్యా రంగం కోసం కావాల్సిన భూములను కేటాయిస్తామన్నారు. ఏవియేషన్ ఎడ్యుసిటీకి భూముల కేటాయింపుకు కూడా అక్కడే బీజం పడిందన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలకు సీఎం కార్యాలయం నుంచి ఆమోదం లభించాల్సి ఉందన్నారు. దాని కోసం సోమవారం రాత్రి తాము సీఎం కార్యాలయంతో మంతనాలు జరిపామన్నారు. 90 శాతం భూములు ఎడ్యుసిటీ ఏర్పాటుకు ఉచితంగా ఇస్తామని అదితి రాజు తెలిపిన విషయం సీఎంఓ సెక్రటరీ నమ్మకలేకపోయారన్నారు. కానీ ఒక్క రూపాయి కూడా ఆశించుకుండా భూమిని దానం చేశారన్నారు. తమ వంశానికి ఏవియేషన్ రంగంలో అనుంబంధం ఉందని.. మాన్సాస్ పేరు కూడా ఎడ్యు సిటీకి పెడుతున్నారని.. అదే తమకెంతో సంతోషమని వారు చెప్పడం తనను ఆశ్చర్యపరిచిందని మంత్రి లోకేష్ తెలిపారు.
ఐఎస్బీ గురించి కథలు విన్నాము
హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ఏర్పాటు సమయంలో చాలా మంది నవ్వారన్నారు. అయినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకొచ్చారన్నారు. నేడు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటిగా అది నిలిచిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికత నుంచి పుట్టిందే ఏవియేషన్ ఎడ్యుసిటీ అని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఎడ్యు సిటీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఐఎస్బీ గురించి కథలు విన్నామని.. ఇప్పుడు అలాంటి కథలే ఎడ్యు సిటీ గురించి వింటామని ధీమా వ్యక్తం చేశారు. ఇంజిన్, డ్రోన్, ఏవియాన్స్, పైలట్స్ వంటి అంశాలపై రామ్మోహన్ నాయుడుతో చర్చించానన్నారు. అందుకు సంబంధించిన నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఇక్కడ ఏర్పాటవుతాయన్నారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో యూనివర్సిటీని ఎడ్యుసిటీలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
క్లస్టర్ల వారీగా అభివృద్ధి
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కానీ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది తమ లక్ష్యంగా పేర్కొన్నారు. అందుకే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తో ముందుకు సాగుతున్నామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం 23 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వాటిల్లో ఒక ఎకో సిస్టం ఉంటుందన్నారు. ఒక ఇంజిన్ తయారీకి వెయ్యి సంస్థ కాంపోనెంట్స్ తయారు చేస్తాయన్నారు. ఆ కంపెనీలను కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి ఒక ప్రత్యేక క్లస్టర్ గా ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను ఏపీ యువతకు కల్పించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అందుకు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
జీపీఎస్.. మిస్సైల్స్
ఏపీ ప్రభుత్వంలో జీపీఎస్, మిస్సైల్స్ ఉన్నాయన్నారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రులు, గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజులు జీపీఎస్ లు అని, తాను, అదితి గజపతి రాజు, రామ్మోహన్ నాయుడు మిస్సైల్స్ అని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు వారు తమను నిరంతరం గైడ్ చేస్తుంటారన్నారు. ఇటీవల కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశామన్నారు. ఏపీలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ గురించి చెప్పామన్నారు. దాని పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఏపీ మోడల్ అమలు చేయాలని తెలిపారన్నారు. అయితే మాక్ అసెంబ్లీ విజయవంతం కావడానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడి మార్గదర్శనమే కారణమని ప్రకటించారు. అసెంబ్లీలో నిర్వహించాలని తాను పట్టుబట్టినప్పటికీ, అసెంబ్లీ ఆవరణలో నిర్వహించేలా చేశారన్నారు. తరువాత వచ్చిన విమర్శలు చూసి ఆయన ముందు చూపు అర్థం చేసుకున్నాం అన్నారు. జీపీఎస్ ల ఆశీర్వాదం తమపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. గవర్నర్ అశోక గజపతి రాజు కుటుంబం సాదాసీదాగా కనిపించినప్పటికీ వారు చేసిన త్యాగాలు ఎనలేనివని కొనియాడారు.






