- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap: కుక్క కరిచిందని ఆస్పత్రికి వెళితే...?
by Vemula.Srinu Prasad |
కుక్క కరిచిందని ఆస్పత్రికి వెళితే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి..

X
దిశ, వెబ్ డెస్క్: కుక్క కరిచిందని ఆస్పత్రికి వెళితే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. అటూ ఇటూ చూస్తే ఎవరూ కనిపించలేదు. ఉదయం 8 గంటలకు డ్యూటీ ముగించికుని వెళ్తు్న్న వైద్య సిబ్బందిని ప్రశ్నిస్తే.. షిప్ట్ డాక్టర్ వస్తారని చెప్పారు. దీంతో ఓ వ్యక్తి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన కుమారుడికి కుక్క కరిచిందని దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన జరిగిందిదీ అని వైద్య సిబ్బంది నిర్వాకాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ఈ ఘటన నంద్యాల జిల్లా శిరివెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. ఎవరూ లేకుండా ఖాళీగా ఉన్న ఆస్పత్రి విజువల్స్ ను చూసిన నెటిజన్లు వైద్యశాఖపై విమర్శలు కురిపిస్తున్నారు. వైద్యం కోసం వెళితే ఎవరూ లేకపోవడం దారుణమని, ఇదీ ప్రభుత్వ ఆస్పత్రుల తీరు అని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆస్పత్రిలో సిబ్బంది పని తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.
Next Story






