- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Police: పోలీస్ బట్టలు ఉడదీసి ఏమి చూద్దామని?
జగన్ వ్యాఖ్యలపై విజయవాడ పోలీసులు స్పందించారు

దిశ డైనమిక్ బ్యూరో : జగన్ వ్యాఖ్యలపై విజయవాడ పోలీసులు (Police) స్పందించారు. పోలిస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ మాట్లాడుతూ నిన్న అనంతపూర్ జిల్లా లో వై ఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రం గా ఖండిస్తున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి గా వున్నా మిరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్నారు. కేవలం ఇది రాజకీయ మైలేజీ కొరకు జగన్ (YS Jagan) ఊగిపోతున్నట్టు అనిపిస్తుంది అని తెలిపారు. పోలీస్ డ్రెస్ ఒక ఉక్కు కవచం లాంటిది రాజ్యాంగ హక్కును కాపాడేది.. పోలీస్ ఉద్యోగం చేయడం సామాన్య విషయం కాదు అని పేర్కొన్నారు. మీరే ఇలా మాట్లాడుతుంటే శాంతి భద్రతలు ఎక్కడనుండి వస్తాయన్నారు. పోలీస్ బట్టలు ఉడదీసి ఏమి చూద్దామని ప్రశ్నించారు. జగన్ పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. 5 వేల మంది మహిళా పోలీసులు ఉన్నారు..జగన్ అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. చట్టపరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.






