Tirumala:భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి ఎంత సమయమంటే?

by Jakkula.Mamatha |

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.

Tirumala:భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి ఎంత సమయమంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. దీంతో కొన్ని సార్లు భక్తుల రద్దీ సాధారణంగా, మరికొన్ని సార్లు అధికంగానూ ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ(సోమవారం) తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న(ఆదివారం) 79,478 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని 26,667 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు(Devotees) సమర్పించిన కానుకల రూపంలో హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Next Story