- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala:కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు.
ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు(గురువారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(బుధవారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 70,372 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.25 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.






