- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలివస్తుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలివస్తుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొన్నిసార్లు అధికంగానూ.. మరికొన్ని సార్లు సాధారణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో వైకుంఠ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే.. నిన్న(గురువారం) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని 58,864 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,784 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.






