- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala:కంపార్టుమెంట్లన్నీ ఫుల్.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో ఏపీలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ఈ నేపథ్యంలో నేడు(సోమవారం) తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్టమెంట్లన్నీ నిండి ఏటీజీహెచ్ అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న(ఆదివారం) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని 91,538 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,339 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.80 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.






