- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం ఆలయ సీఎస్‌వోపై వేటు.. కారణం ఏంటంటే?
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తారు

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తారు. ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఆధికారులు చర్యలు తీసుకుంటారు. తాజాగా శ్రీశైలంలో అన్యమతస్థుల హల్‌చల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో శ్రీశైలం అన్యమతస్థుల వ్యవహరంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నపై పాలకమండలి వేటు వేసింది. సీఎస్‌ఓగా ఉద్యోగ బాధ్యతల పట్ల అయ్యన్న నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఆలయ ఈవో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీశైల మల్లికార్జున ఆలయానికి 10 రోజుల క్రితం కొందరు వ్యక్తులు వచ్చారు. ఆ సమయంలో వారి వద్ద అన్యమతానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నట్టు క్యూలైన్ల వద్ద భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో అన్యమతస్థులు ఆలయానికి వచ్చి హల్‌చల్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సిబ్బంది వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్యమతస్థులు శ్రీశైలంలో కలకలం సృష్టించారన్న ఆరోపణల నేపథ్యంలో, భద్రతాపరమైన అంశాల్లో సీఎస్‌ఓ అయ్యన్న నిర్లక్ష్యంగా ఉన్నారని ఆలయ ఈవో శ్రీనివాసరావు భావించారు. ఈ క్రమంలో ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.






