తెలంగాణ సీఎం పై ఏపీ మంత్రి ఫైర్.. కారణం ఏంటంటే?

by Jakkula.Mamatha |

తెలంగాణ(Telangana) సీఎం రేవంత్(CM Revanth) పై ఏపీ(Andhra Pradesh) మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ సీఎం పై ఏపీ మంత్రి ఫైర్.. కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana) సీఎం రేవంత్(CM Revanth) పై ఏపీ(Andhra Pradesh) మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi)ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గాడ్సేతో పోల్చడం పై ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని అసమర్థ సీఎం రేవంత్ అంటూ మండిపడ్డారు. తుమ్మితే ఊడిపోయే పదవిని కాపాడుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజల దృష్టిని మరల్చడం ఆయనకు అలవాటే అన్నారు. పదవీ కాలాన్ని పెంచుకోవడం కోసం ఆయన స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. బీజేపీని అడ్డుకోవడం, నెహ్రూ-ఇందిరా-సోనియా-రాహుల్ కుటుంబం వల్లే కాలేదు. ఆ కుటుంబం మోచేతి నీళ్లు తాగే సీఎం రేవంత్ రెడ్డి వల్ల ఏమవుతుంది? అని మంత్రి సత్య కుమార్ యాదవ్(Minister Satya Kumar yadav) ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు.

Next Story