- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sharmila: అసలు వైసీపీకి వైఎస్సార్ కు ఏం సంబంధం?
కూటమి ప్రభుత్వానికి వైసీపీ పై కోపాన్ని వైఎస్సార్విగ్రహాల మీద చూపిస్తారా ? అసలు వైసీపీకి వైఎస్సార్‌కి ఏం సంబంధం ? అంటూ ఏపీసీసీ చీఫ్వైఎస్షర్మిల ధ్వజతెత్తారు.

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజం
దిశ, డైనమిక్ బ్యూరో : కూటమి ప్రభుత్వానికి వైసీపీ పై కోపాన్ని వైఎస్సార్విగ్రహాల మీద చూపిస్తారా ? అసలు వైసీపీకి వైఎస్సార్‌కి ఏం సంబంధం ? అంటూ ఏపీసీసీ చీఫ్వైఎస్షర్మిల ధ్వజతెత్తారు. మహానేత పేరు పెట్టినంత మాత్రాన వైఎ స్సార్ ఏమైనా వారి సొత్తా.. లేక పేటెంట్ రైటా ? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాభిమానం కలిగిన నాయకుడికి నీచ రాజకీయాలు చేసే వారితో కలిపి ఆపాదిస్తారా ? ఆయన విగ్రహాల మీద కక్ష రాజకీ యాలు చేస్తారా ? ఇదెక్కడి దిక్కుమాలిన చర్య ? అన్నారు. నందిగామ గాంధీ సెంటర్ లో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గం. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. తొలగించిన చోట వెంటనే రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయండి. లేకుంటే ఉద్యమం తప్పదని తీవ్రంగా హెచ్చరించారు.






