- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Deputy CM: ఏపీ శకటానికి బహుమతి.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?
ఢిల్లీ(Delhi)లో నిర్వహించిన (జనవరి 26)రిపబ్లిక్ డే(Republic Day) వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మలతో కూడిన ఏపీ శకటాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఢిల్లీ(Delhi)లో నిర్వహించిన (జనవరి 26)రిపబ్లిక్ డే(Republic Day) వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మలతో కూడిన ఏపీ శకటాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ(బుధవారం) రిపబ్లిక్ డే పరేడ్ శకటాలు ఫలితాలను రక్షణ మంత్రిత్వ శాఖ(Ministry of Defence) ప్రకటించడం జరిగింది. గణతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో నిలించింది. తొలి రెండు స్థానాల్లో ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh), త్రిపుర(Tripura) ఉన్నట్లు పేర్కొన్నారు. ఏపీలోని ఏటికొప్పాక బొమ్మల శకటానికి మూడో స్థానం దక్కడం పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్రానికి చెందిన శకటానికి తృతీయ బహుమతి రావడం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఏటికొప్పాక బొమ్మలతో శకటం ఏర్పాటు చేయడం పై పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. హస్తకళలు చాటేలా శకటం ప్రదర్శన ఉందన్నారు.
శకటాల పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఏటికొప్పాక లక్క బొమ్మల ప్రదర్శనలో శకటం మూడో స్థానం సాధించి బహుమతికి ఎంపిక కావడం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu), ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి(PM Modi) ఏపీ ప్రభుత్వం(AP Government) తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏటికొప్పాక బొమ్మలకు ప్రాచుర్యం కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్ర చెట్ల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే అతిథులకు ఇచ్చే జ్ఞాపికల్లో వీటిని చేర్చామని వివరించారు. రిపబ్లిక్ డే పరేడ్(Republic Day Parade) కోసం ఏటికొప్పాక శకటం ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపించినందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు ఈ ఏటికొప్పాక శకటానికి సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున మద్ధతు లభించిన విషయం తెలిసిందే.






