Hotline: హాట్‌లైన్ అంటే ఏమిటి? ఈ పద్ధతిలో ఎలా చర్చిస్తారంటే..

by Thanuru Gopichand |

భారత్, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో ) మధ్య చర్చలు మొదలయ్యాయి.

Hotline: హాట్‌లైన్ అంటే ఏమిటి? ఈ పద్ధతిలో ఎలా చర్చిస్తారంటే..
X

దిశ డైనమిక్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో ) మధ్య చర్చలు మొదలయ్యాయి. భారత్ పాక్ మధ్య ఘర్షణల దృష్ట్యా హాట్ లైన్లో డీజీఎంవోలు (DGMO) చర్చలు చేస్తున్నారు. ఈ చర్చల్లో భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ , పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాసిఫ్ చౌదరి పాల్గొంటున్నారు. వారి మధ్య కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపుపై పలు అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సందర్భంగా అసలు హాట్​లైన్​అంటే ఏమిటి.. ఈ పద్ధతిలో ఎలా చర్చించుకుంటారు అనే ఆసక్తి ప్రజల్లో కలుగుతోంది. హాట్​లైన్​ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) మధ్య ఏర్పాటు చేసిన ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ. దీనిని సైనిక సంబం ధిత సమస్యలు, విషయాలను, సరిహద్దు సమస్యలను చర్చించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఈ లైన్​ సంభాషణ ద్వారా ఇరుదేశాల సైనికాధికారులు ఒకరికొకరు మాట్లాడుకుంటారు.

దేశ సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘన జరిగిన సందర్భాల్లో ఇటువంటి లైన్​ద్వారానే సంప్రదింపులు జరుపుతారు. ఒకరి నుంచి మరొకరికి సహాయం అందించడానికి ఈ హాట్ లైన్ సంభాషణ చేస్తారు. చైనా, భారత్ మధ్య కూడా డీజీఎంవో హాట్‌ లైన్ ఉంది. ఇది దేశాల సరిహద్దు, ఇతర సైనిక సమస్యల గురించి చర్చించడానికి ఉపయోగించబడుతుంది. పాకిస్తాన్ (Pakistan) నుండి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనల గురించి, లేదా ఇతర సైనిక సమస్యల గురించి సమాచారం అందించడానికి భారత్ (Inidia) డీజీఎంవో పాకిస్తాన్ డీజీఎంవోను హాట్‌లైన్‌ ద్వారా సంప్రదిస్తుంది. ఈ నెల 10వ తేదీన అవగాహన ఉల్లంఘనపై పాక్​డీజీఎంవో హాట్​లైన్​లో భారత్​ సందేశం పంపింది. ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే తగిన రీతిలో జవాబు ఇస్తామని స్పష్టమైన సందేశం ఇచ్చింది. దీంతో డీజీఎంవో స్థాయిలో చర్యలు హాట్​లైఊన్​లో చర్చలు జరపాలని నిర్ణయించారు.

Next Story