రాష్ట్రంలో దారుణం.. ఆ గుడి కూల్చివేత.. ప్రజలు ఏం చేశారంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-14 08:50:55  IST  )

రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

రాష్ట్రంలో దారుణం.. ఆ గుడి కూల్చివేత.. ప్రజలు ఏం చేశారంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఏపీ(Andhra Pradesh)లోని తిరుపతి జిల్లా దామినేడులో భూ వివాదాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఆలయాన్ని ఓ వ్యక్తి నేలమట్టం చేశారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే.. ఇనాం భూమిలో ఉన్న పురాతన నాగాలమ్మ ఆలయాన్ని ఇటీవల కృష్ణమూర్తి నాయుడు అనే వ్యక్తి కూల్చివేశాడు. ఆ భూమి తనదేనంటూ అర్ధరాత్రి నాగాలమ్మ గుడి(Nagalamma temple) వద్ద ఆనవాళ్లే లేకుండా చేశాడు.

దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. వారిపై అతను తన అనుచరులతో దాడులు చేయగా, గ్రామస్తులు తిరగబడి తరిమికొట్టారు. ఈ తరుణంలో ఇరువర్గాల మధ్య కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కృష్ణమూర్తినాయుడు, అతని అనుచరులను తిరుచానూరు స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఆలయ స్థలం పై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story