- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది తప్పా నేను ఏం చేయలేను: డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జాతీయా మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జాతీయ మీడియాకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో రాష్ట్ర రాజకీయాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు, లిక్కర్ కుంభకోణం, జనసేన పార్టీ నిర్మాణం, సినిమాలపై తన ఆసక్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్రలు జరిగాయని ఆరోపించారు. అలాగే, అప్పట్లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులన్నీ ఆధారాల ఆధారంగానే జరుగుతున్నాయని, ఆధారాలు లేకుండా ఎవరిపైనా కేసులు వేయడం లేదని స్పష్టం చేశారు. ఇటీవల చర్చనీయాంశంగా మారిన లిక్కర్ కేసులో మాజీ సీఎం జగన్ అరెస్ట్ అంశంపై మాట్లాడారు. పాలనలో నియమాలు, లెక్కలు ప్రామాణికతగా ఉండాలని పవన్ చెప్పారు.
జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు జనసేన సంస్థాగత నిర్మాణంపై నేను దృష్టి పెట్టలేదు. ఇకపై ఆ దిశగా కార్యాచరణ ప్రారంభిస్తాను' అని చెప్పారు. అలాగే రాజధాని భూసేకరణ అంశంలో రైతులపై ఎలాంటి బలవంతం ఉండదని, ఇష్టంతోనే భూములు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వటంపై ఇంకా చర్చ జరగలేదని, ఆ నిర్ణయం తానే తీసుకోవాల్సి ఉంటుందని పవన్ తెలిపారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు తప్పవు, కానీ వాటిని అధిగమిస్తామన్నారు.
అలాగే, రంగంపై తన ప్రేమను పంచుకుంటూ.. చారిత్రక రచనలు అంటే తనకు ఇష్టమని చెప్పారు. చారిత్రక సినిమాలు తీయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ఇప్పటివరకు తీయలేకపోయానని తెలిపారు. కరోనా కారణంగా కొన్ని ప్రాజెక్టులు నిలిచిపోయాయని, క్రిష్ రూపొందిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ విషయంలో కూడా అదే జరిగిందన్నారు. రాజకీయాలే తన ప్రాధాన్యత అయినప్పటికీ, సినిమాలు తనకు ఇంధనమని చెప్పారు. 'సినిమా తప్పా నేను ఏం చేయలేను' అంటూ తన నటనా ప్రవృత్తికి పునరుద్ఘాటన ఇచ్చారు.






