ఆ రోజే YSRCP పీఏసీ సమావేశం.. చర్చించే అంశాలివే?

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh)లో వైసీపీ పీఎసీ కమిటీ సమావేశానికి తేదీ ఖరారైంది.

ఆ రోజే YSRCP పీఏసీ సమావేశం.. చర్చించే అంశాలివే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో వైసీపీ ‘పీఏసీ’ కమిటీ సమావేశానికి తేదీ ఖరారైంది. ఈ నెల(జులై) 29న తాడేపల్లిలో వైసీపీ(YSRCP) పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(PAC) సమావేశం కానుంది. ఈ సమావేశంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ భేటీలో ప్రజా సమస్యలు, పార్టీ కార్యాచరణపై వైఎస్ జగన్(Former CM YS Jagan) చర్చించనున్నారు. సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా మాజీ సీఎం వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వ(AP Government) పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ వైఎస్ జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే.

Next Story