ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతల బైఠాయింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-02 09:00:54  IST  )

ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవుడు భూములు కబ్జా చేశారంటూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు...

ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతల బైఠాయింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు కలెక్టరేట్(Eluru Collectorate) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవుడు భూములు(God lands) కబ్జా చేశారంటూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద బైటాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైఎస్ జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. లక్ష్మిపురరం జగన్నాథస్వామి ఆలయ భూవివాదం(Lakshmipuram Jagannathaswamy Temple Land dispute)పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అయితే నిరసనకు అనుమతిలేకపోవడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయినా సరే నిరసన వ్యక్తంచేశారు. ఆలయ భూరికార్డులను కమ్మవారి సేవా సంఘం పేరుపైకి మార్పు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story