- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జంగారెడ్డి గూడెంలో కూలిన స్కూలు స్లాబ్.. ఉద్రిక్తత
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రైవేటు స్కూలు స్లాబ్ కుప్పకూలడంతో 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి....

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా(Eluru District) జంగారెడ్డిగూడెం(Jangareddy Gudem)లో ప్రైవేటు స్కూలు(School) స్లాబ్ కుప్పకూలింది. దీంతో 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ఈ మేరకు వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అయితే నిర్మాణంలో నాణ్యత, భద్రతా లోపం వల్లే జరిగిందని తెలుస్తోంది. జంగారెడ్డి గూడెంలో ఓ ప్రైవేటు సంస్థ స్కూలు నిర్మాణాన్ని చేపట్టింది. ఈ రోజు స్లాబు వేసేందుకు ప్రయత్నించింది. కార్మికులంతా స్లాబు నిర్మాణ పనులో ఉన్న సమయంలో ఒక్కసారిగా స్లాబ్ కూలింది. దీంతో కార్మికులు కిందపడిపోయారు. అయితే ఈ ఘటనలో పదిహేను మంది వరకు గాయాలయ్యాయి. వీరిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. క్షతగాత్రుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అయితే కార్మికుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.






